Kathaaprapancham

0

మహాభారతం(22 భాగం)

మేనకావిశ్వామిత్రుల కుమార్తె శకుంతల. పెంచి పోషించిన కారణంగా కణ్వుడు ఆమెకు తండ్రి అయినాడు. అందుకే తన మనసు ఆమెను కోరుకుంటున్నది. తప్పులేదిందులో అనుకున్నాడు దుష్యంతుడు. శకుంతలకూడా అదే అవస్థలో ఉండడాన్ని గమనించాడతను. పరిశీలనగా చూశాడామెను. జింకచర్మాల్లోనూ, నారగుడ్డల్లోనూ ఉన్నదామె. తట్టుకోలేకపోయాడు దుష్యంతుడు. అన్నాడిలా. నీకు ఈ పూరిగుడిసెలూ,...

0

మహాభారతం(21 భాగం)

సత్పురుషలోకానికి చేరుకున్న యయాతి, తమ తాతగారు అని తెలిసి, మనవలు ఎంతగానో సంతోషించారు. ఆ మహాత్ముని అడిగి, అనేక సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ధర్మాధర్మాలరహస్యం, సుగతి–దుర్గతి, జీవులగర్భోత్పత్తి తదితర వివరాలన్నీ అడిగారు. వాటన్నిటినీ వివరించి చెప్పాడిలా యయాతి. ధర్మంగా నడచుకోవడం సుగతి. అధర్మం దుర్గతి. సుగతి మోక్షం....

0

మహాభారతం(20 భాగం)

అంతఃపురంలో అడుగుపెట్టాడోలేదో శుక్రుడిశాపం ఫలించింది. యయాతిని ముసలితనం ఆవరించింది. అతని ఇంద్రియాలు పటుత్వం తప్పాయి. తల వణకిపోసాగింది. అవయవాలు వడలిపోయాయి. శరీరం ముడతలుపడింది. ముగ్గుబుట్టయింది తల. ఆయాసం, దగ్గు, తలనొప్పి బాధించసాగాయి. ఇంత అందమైన యయాతీ అనాకారిగా, అసహ్యంగా తయారయ్యాడు. నిలబడలేడు. నడలేడు. తినలేడు. చూడలేడు. అయినా...

0

మహాభారతం(19 భాగం)

వేటకివచ్చాడు యయాతి. ఎవరో పిలిచినట్టుగా చెలికత్తెలుసహా దేవయానీశర్మిష్ఠలు ఎక్కడైతే ఆటలాడుతున్నారో అక్కడకి వచ్చాడు. అతనికి ఎదురేగింది దేవయాని. పూలతో పూజించిందతన్ని. పూజిస్తున్న దేవయానిని గుర్తుపట్టాడు యయాతి. కొద్దిదూరంలో వినయంగా, వయ్యారంగా నిల్చున్న శర్మిష్ఠని గుర్తుపట్టలేకపోయాడు. ఈ అందాలరాశి, ఈ అప్సరస ఎవరు? నేలమీదికి ఎప్పుడు వచ్చింది? ఎందుకువచ్చింది?...

0

మహాభారతం(18 భాగం)

తొలిచూపులోనే కచుణ్ణి ప్రేమించాను అన్నది దేవయాని. తనని పరిగ్రహించమన్నది. గురుపుత్రిక చెల్లెలతో సమానం. నువ్వు అలా అనరాదు అన్నాడు కచుడు. తప్పు అన్నాడు. ఆ మాటలకు స్పృహ తప్పుతున్నట్టయింది. ముందుకు తూలింది దేవయాని. అంతలోనే తేరుకుని నిలదొక్కుకుంది. తోకతొక్కిన తాచు అయింది. శపించిందిలా. కోరి వచ్చిన నన్ను...

0

మహాభారతం(17 భాగం)

వృషపర్వుడు రాక్షసరాజు. అతని దగ్గర శుక్రుడు ఆచార్యుడిగా ఉండేవాడు. రకరకాల మాయోపాయాలు చేస్తూ, రాక్షసులకు మేలు చేసేవాడు శుక్రుడు. దేవతలకీ, రాక్షసులకీ యుద్ధం జరిగితే, ఆ యుద్ధంలో మరణించిన రాక్షసులందరినీ తన మృతసంజీవనీవిద్యతో బతికించేవాడతను. దాంతో రాక్షససైన్యం తరుగులేకుండా ఉండేది. దేవతలు మాత్రం తరగిపోతూ ఉండేవారు. రాక్షసులు...

0

మహాభారతం(16 భాగం)

ధనువుగర్భంలో విప్రచిత్తి, శంబరుడు, నముచి, పులోముడు, లోముడు ఆదిగా నలభైమంది పుట్టారు. కొడుకులూ, మనుమలూ, మునిమనుమలూ…వారంతా పెరిగిపెరిగి లెక్కలేనంతమంది అయ్యారు. దనువుసంతతికాబట్టి వారందరినీ దానవులు అన్నారు. కాలగర్భంలో వినాశనుడు, క్రోధుడు ఆదిగా ఎనమండుగురూ, కాలకేయులూ పుట్టారు. అనాయువుగర్భంలో విక్షరుడు, బలుడు, వీరుడు, వృతుడు పుట్టారు. సింహికగర్భంలో రాహువుపుట్టాడు....

0

మహాభారతం(15 భాగం)

వలలో చిక్కిన చేపను తీసి, దానిని నిలువునా కోసారు జాలర్లు. చేపకడుపులో ఇద్దరు పిల్లలు ఉండడాన్ని గమనించారు. మానవాకారంలో ఉన్నారిద్దరూ. మగపిల్లవాడొకడు. రెండవది ఆడపిల్ల. వాళ్ళనేం చెయ్యాలో జాలర్లకుపాలుపోలేదు. తలలుపట్టుకున్నారు. రాజుకి అప్పగిస్తే సరి అన్నారెవరో! ఆ ఆలోచన బాగుందంటే బాగుందనుకున్నారు జాలర్లు. పిల్లలను తీసుకుని వెళ్ళి...

0

మహాభారతం(14 భాగం)

నాయనా! మామ మాటవిను, నీ తల్లి వంశాన్ని రక్షించు! లే! వెళ్ళు! సర్పయాగాన్ని ఆపించు అన్నది జరత్కారువు. సమాధానంగా కళ్ళు మూసుకున్నాడు ఆస్తీకుడు. ఆలోచనలోపడ్డాడు. కాసేపటికి కళ్ళు తెరచి అన్నాడిలా. ఇప్పటికి గతించినవారు గతించారు. ఇకపై ఏ ఒక్కరూ ఆ యాగానికి బలికారు. భయపడకు అన్నాడు ఆస్తీకుడు....

0

మహాభారతం(13 భాగం)

కాశ్యపుణ్ణి పరీక్షించదలచాడు తక్షకుడు. పచ్చనిచెట్టుని కాటేసి బూడిదకుప్పను చేస్తాను, బతికించుచూద్దాం అన్నాడు. అంటూనే వెళ్ళి, దగ్గరగా ఉన్న మర్రిచెట్టుని చుట్టుకుని ఒకే ఒక్క కాటు వేశాడు. వెంటనే చెట్టుని వదలిపెట్టాడు. చెట్టును తక్షకుడు వదలిపెట్టడం ఏమిటి? అంత చెట్టూ మచ్చుకైనా లేకుండా భగ్గున మండిపోయింది. బూడిదకుప్పగా మిగిలిపోయింది....