Kathaaprapancham

0

మహాభారతం(32 భాగం)

మరో కుమారుడు కావాలన్నాడు పాండురాజు. కుంతిని కనమన్నాడు. ఇప్పుడు నువ్వు కనబోయేవాడు మంచి బలవంతుడుకావాలి. అందుకని వాయుదేవుణ్ణి ఆవాహనచెయ్యి అన్నాడు. వాయుదేవుణ్ణి ఆవాహనచేసింది కుంతి. గర్భవతి అయింది. కొన్నాళ్ళకు కొడుకును కన్నది. అతను బండలా ఉన్నాడు. ఉక్కుగుండులా ఉన్నాడు. అతన్ని ‘భీముడు’ అన్నది ఆకాశవాణి. భీముణ్ణి ఎత్తుకుని...

0

మహాభారతం(31 భాగం)

సంతానం లేనివారికి స్వర్గం లేదు. సంతానం లేనప్పుడు నేను బతికినా మరణించినా ఒకటేనన్నాడు పాండురాజు. ఆ మాటలకి అతన్ని భయవిహ్వలంగా చూసింది కుంతి. ధర్మబద్ధంగా మనకి సంతానం కలిగే మార్గం చూడాలి. నా ధర్మానికి తోడూనీడా నువ్వేకాబట్టి, నువ్వే దీనికి తగిన ఉపాయం ఆలోచించాలి అన్నాడు పాండురాజు....

0

మహాభారతం(30 భాగం)

కుంతీకన్య స్వయంవరానికి అనేకరాజులసహా పాండురాజూ వచ్చాడు. అందరిలోనూ పాండురాజునే వరించింది కుంతి. కుంతీపాండురాజుల వివాహం చాలా వైభవోపేతంగా జరిగింది. శల్యుడు మద్రదేశం రాజు. అతనికి ఓ చెల్లెలు ఉంది. ఆమె పేరు మాద్రి. ఆమెను కూడా పాండురాజు వివాహం చేసుకున్నాడు. పాండురాజు పెళ్ళయింది. ప్రతాపవంతుడు. పట్టపగ్గాలు ఉంటాయా?...

0

మహాభారతం(29 భాగం)

కొరత అనుభవిస్తూ కూడా తపస్సు చేసుకోసాగాడు మాండవ్యుడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయారు మహారుషులు. మహాతపశ్శాలివి. నీకు ఈ కొరత ఏమిటి? అని ప్రశ్నించారు. సుఖదుఃఖాలు రెండూ మనకర్మలే! చేసిన పాపపుణ్యాలే మనల్ని ఇలా బాధించడంగానీ, ఆనందింపచేయడంగానీ చేస్తాయి అన్నాడు మాండవ్యుడు. ఇందులో రాజుతప్పు ఎంతమాత్రమూ లేదన్నాడు. ఆ...

0

మహాభారతం(28 భాగం)

దీర్ఘతముణ్ణి ప్రార్థించి, సుధేష్ణను ఒప్పించి, ఆమెను అతనిదగ్గరకు పంపించాడు బలిరాజు. ఈసారి ఎలాంటి పొరపాటూ జరగరాదన్నాడు. అలాగేనన్నది సుధేష్ణ. బాగా ముస్తాబైంది. దీర్ఘతమునికి చేరువైంది. ఆమె అవయవాలన్నీ స్పృశించాడు దీర్ఘతముడు. వంశోద్ధారకులూ, సత్యసంధులైన కొడుకులు పుడతారు అన్నాడు. సంగమించాడామెతో. అప్పుడు సుధేష్ణకి అంగరాజుపుట్టాడు. ఉత్తమక్షత్రియులభార్యలకు ఇలాగే సంతానంకలిగింది....

0

మహాభారతం(27 భాగం)

తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి వివాహంచేసేందుకు కాశీరాకుమార్తెలు ముగ్గురినీ స్వయంవరమండపం నుంచి తీసుకుని వెళ్తూ, తాను చేస్తున్నది తప్పు అని భావిస్తే, తనని ఎదిరించే సత్తా ఉంటే యుద్ధానికి రండి అన్నాడు భీష్ముడు. రాజులను ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని అందుకుని రాజులు తిరగబడ్డారు. జడివానలా శరప్రయోగం జరిగింది. స్వయంవరమండపం...

0

మహాభారతం(26 భాగం)

ఒకనాడు వేటాడుతూ వచ్చి యమున ఒడ్డుకు చేరుకున్నాడు శంతనుడు. ఓ పడవరేవును సమీపించాడు. ఆ రేవులో పడవమీద సత్యవతి కనిపించిందతనికి. ఆమె అందాన్ని చూసి మతిపోగొట్టుకున్నాడు శంతనుడు. అడుగుముందుకువేసి, ప్రేమగా ఎవరు నువ్వు? ఇంత అందగత్తెవి, పడవనడుపుతున్నావేమిటి? అని అడిగాడు. నేను దాశరాజుకూతుర్ని. నా పేరు సత్యవతి....

0

మహాభారతం(25 భాగం)

గంగాశంతనులిద్దరూ ఒక్కటయ్యారు. చిలకాగోరింకలయ్యారు. కాపురం చేయసాగారు. శంతునునికి గంగే లోకం అయింది. అలాగే గంగకి కూడా శంతనుడే లోకం అయ్యాడు. ఆందానికీ, ఆనందానికీ ఆ ఇద్దరూ చిరునామా అయ్యారు. కొద్దిరోజులుగడిచాయి. గంగగర్భవతి అయింది. ముద్దులుమూటలాంటి కొడుకును కన్నది. ఆ కొడుకును తీసుకుని వెళ్ళి, నదిలో పడవేసి వచ్చిందామె....

0

మహాభారతం(24 భాగం)

రాజ్యపాలన అప్పగించి, దుష్యంతుడు తపోవనానికి తరలిపోవడంతో భరతుడు మహరాజయ్యాడు. అనేకయజ్ఞాలు చేశాడు. భరతవంశానికి మూలపురుషుడు అయ్యాడు. భరతునిభార్య సునంద. ఆమె కేకేయరాజుకూతురు. వారి కొడుకు భుమన్యుడు. భుమన్యునికొడుకు సుహోత్రుడు. సుహోత్రునికొడుకు హస్తి. ఈ హస్తిపేరునే కౌరవరాజధాని హస్తినాపురం ఏర్పడింది. హస్తిభార్య యశోధర. వారికొడుకు వికంఠనుడు. వికంఠనునికొడుకు అజమీఢుడు....

0

మహాభారతం(23 భాగం)

సాయంగా పంపిన తండ్రిశిష్యగణం, కుమారుడుభరతుడుసహా దుష్యంతుని సభామందిరంలోనికి వచ్చి నిలిచింది శకుంతల. తనని గుర్తుపట్టనట్టుగా చూస్తున్న మహారాజుకి తానెవరో చెప్పింది. తాను అతని భార్యనన్నది. భరతుడు తమ సంతానం అన్నది. అంతేకాదు, ఆనాడు రాజు ఇచ్చిన మాటప్రకారం భరతుణ్ణి యువరాజుని చెయ్యమన్నది. అంతే! దుష్యంతునికి తట్టుకోలేనంత కోపం...