Kathaaprapancham

0

మహాభారతం(41 భాగం)

ఎక్కడకి వెళ్ళినా, ఎవరిని కదిపినా పాండవులగురించే వినవస్తున్నది. అంతా పాండవులనే పొగుడుతున్నారు. యువరాజంటే ధర్మరాజే అంటున్నారు. తట్టుకోలేకపోతున్నాడు దుర్యోధనుడు. పాండవులంటే అతనికి ఒంటిమీద తేళ్ళూ, జెర్రెలూ పాకుతున్నట్టుగా ఉంది. ఆ బాధ తీరేందుకు కర్ణ, శకుని, దుశ్శాసనలతో సమాలోచనలు చేస్తూ రాసాగాడు. ధైర్యానికి పెట్టిందిపేరు పాండవులు. ఆయుధాలు...

0

మహాభారతం(40 భాగం)

ఊహకి అందని బాణాలు ప్రయోగించి, కౌరవుల దేహాలను తూట్లు పొడిచాడు ద్రుపదుడు. కౌరవులకే కాదు, వారి సేనకు కూడా ద్రుపదుడు ఒక్కడిగాగాక వందలు వేలాదిగా కనిపించసాగాడు. ఎక్కడ పడితే అక్కడే! ఎవరితో పడితే వారితో యుద్ధం చేస్తూ కనిపించాడతను. ద్రుపదుడు బహురూపి అనుకున్నారు కౌరవులు. భయపడిపోయారు. యుద్ధరంగం...

0

మహాభారతం(39 భాగం)

బంగారు సింహానసం మీద కూర్చున్నాడు కర్ణుడు. శాస్త్రోక్తంగా రాజ్యాభిషిక్తుడయ్యాడు. అంగరాజ్యానికి రాజయ్యాడు. రాజతిలకం దిద్దుకున్నాడు. మణికిరీటం పెట్టుకున్నాడు. భుజకీర్తులు ధరించాడు. రత్నాలహారాలు వేసుకున్నాడు. మహారాజులా ముస్తాబయ్యాడు. అయ్యి, వినయంగా నడచి వచ్చాడు. దుర్యోధనుని ముందు నిల్చున్నాడు. నీకేమీ కాని నన్ను ఆదరించావు. రాజును చేశావు. రాజ్యాధికారం కట్టబెట్టావు....

0

బి.బి.సి లాంగ్వేజ్ లెర్నింగ్

భాష పై ఆసక్తి, పట్టు పొందాలనుకునే వాళ్ళు బిబిసి తెలుగు ని అనుసరించండి వారు నిర్వహించే వివిధ కార్యక్రమాలలో పాల్గొనండి . బిబిసి లెర్నింగ్ ఇంగ్లీష్‌ ఇప్పుడు మన తెలుగులో . కొత్త కొత్త సంగతులు మీతో పంచుకుంటుంది . ఇంకా ఎన్నో ఊసులూ, మరెన్నో కబుర్లూ...

0

మహాభారతం(38 భాగం)

మహాభారతం:38 భుజాన్న అమ్ములపొదులు, చేతిలో ధనుస్సు, గుండెలమీద కవచం ఉంచుకుని అస్త్రప్రదర్శనకు సిద్ధంగా ఉన్న అర్జునుణ్ణి చూశాడు ద్రోణుడు. ప్రారంభించు అన్నట్టుగా కనుసైగ చేశాడు. అంతే! ముందుగా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు. రంగస్థలంలో భీకరమైన అగ్నిని పుట్టించాడు. చూసిన ప్రేక్షకులు పరుగులు పెడదామనుకుంతలో వారుణాస్త్రం ప్రయోగించాడతను. వర్షాన్ని...

0

మహాభారతం(37 భాగం)

శిష్యుల విలువిద్యను పరీక్షించదలచాడు ద్రోణుడు. పక్షిబొమ్మను తయారు చేశాడు. దానిని చెట్టుచివర నిలిపాడు. శిష్యులను కేకేశాడు. వచ్చారంతా. మీ మీ ధనుస్సులూ, బాణాలూ పట్టుకోండి చెప్పాడు ద్రోణుడు. పట్టుకున్నారు శిష్యులు. నేనెవరిని పిలిస్తే వారొచ్చి, అదిగో ఆ చెట్టుచివరనున్న పక్షితలను బాణంతో పడగొట్టాలి. పడగొడతాం అన్నారు శిష్యులు....

0

మహాభారతం(36 భాగం)

హస్తినలో ధనురాచార్యుడిగా స్థిరపడ్డాడు ద్రోణుడు. ద్రోణుడు అలా స్థిరపడ్డాడని తెలిసి, దేశదేశాల రాకుమారులు వచ్చి, అతని దగ్గర విలువిద్యను అభ్యసించసాగారు. అలా అస్త్రవిద్యకు హస్తిన ఆయువుపట్టయింది. ధనుర్విద్యలో అర్జునుడు చురుగ్గా ఉండేవాడు. అతనికి గురువుమాటంటే గురిగా ఉండేది. అనుక్షణం అభ్యాసంలో ఉండేవాడు. గురుపుత్రుడు అశ్వత్థామ అతనితో పోటీపడేవాడు....

0

మహాభారతం(35 భాగం)

రాకుమారులంతా ఊరవతల బంతి ఆట ఆడుతున్నారు. బంతిని గట్టిగా తన్నాడు భీముడు. దెబ్బకి అది వెళ్ళి, దూరంగా ఉన్న నూతిలో పడిపోయింది. పరుగునపోయి చూశారంతా. అడుగున నూతిలో తేలుతూ కనిపించింది బంతి. అందుకుందామంటే ఏ రకంగా ప్రయత్నించినా అందడం లేదది. పైకి తీయడం అసాధ్యం అనుకుని, ఆలోచిస్తూ...

0

మహాభారతం(34 భాగం)

వ్యాసుడు చెప్పిన మీదట కోడళ్ళసహా తపోవనానికి తరలిపోయింది సత్యవతి. అక్కడ జీవితాంతం తపస్సు చేసి, తనువు చాలించింది. అత్తగారిని అనుసరించి, కోడళ్ళుకూడా తర్వాత స్వర్గస్తులయ్యారు. తమ్మునికొడుకులూ, తన కొడుకలని భేదంలేకపోయింది ధృతరాష్ట్రునికి. పాండవుల్నీ, కౌరవుల్నీ ఒకేలా చూసుకునేవాడతను. పాండవులకు కూడా పెదనాన్నంటే చెప్పలేనంత గౌరవం కలిగింది. అతనంటే...

0

మహాభారతం(33 భాగం)

ధర్మరాజు, భీముడు, అర్జునుడు…త్రిమూర్తులాంటి ముగ్గురుకొడుకుల్నీ చూసి మురిసిపోయాడు పాండురాజు. ముల్లోకాల రాజ్యాధికారమూ తనదే! తిరుగులేదనుకున్నాడు. కుంతిని అభినందనగా చూశాడు. సవతిని భర్త అలా అభినందనగా చూడడాన్ని మాద్రి తట్టుకోలేకపోయింది. లోలోపల తల్లడిల్లింది. ముచ్చటగా ముగ్గురు కుమారులను కన్నది కుంతి. వందమందిని కన్నది గాంధారి. తన కడుపే పండలేదు....