Category: ధారావాహికలు

0

మహాభారతం (62 భాగం)

తల్లి కుంతి సహా పాండవులు బతికి ఉన్నారు. ద్రౌపదిని పెళ్ళి చేసుకున్నారు. కాంపిల్యంలో కాపురం ఉన్నారని తెలిసి కకావికలయ్యాడు దుర్యోధనుడు. అతన్ని ఓదార్చి, పాండవులను అంతమొందించేందుకు సరైన ఆలోచన చేశాడు శకుని. చెప్పక తప్పని పరిస్థితిలో పాండవులు జీవించి ఉన్నారని ధృతరాష్ట్రునికి చెప్పాడు విదురుడు. ఆ మాటకి...

0

మహాభారతం (61 భాగం)

యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వనీదేవతలూ ఈ అయిదుగురూ పంచపాండవులు. అయిదుగురు దేవేంద్రులికి భార్యని కావాలని గతంలో లక్ష్మీదేవి తపస్సు చేసింది. ఆ లక్ష్మీదేవి అంశతో జన్మించిందే ఇప్పుడు ఈ ద్రౌపది. ఇదీ అసలు సంగతి అన్నాడు వ్యాసుడు. నమ్మలేనట్టుగా చూశాడు ద్రుపదుడు. నా మాటలు మీద నీకు...

0

మహాభారతం (60 భాగం)

తల్లిమాటా, బ్రహ్మరాతా తప్పించరానివి. ఆమె ఆదేశం అమలు జరిగి తీరాలి. ద్రౌపదిని మా అయిదుగురు అన్నదమ్ములకూ ఇచ్చి వివాహం చెయ్యండి అన్నాడు ధర్మరాజు. సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు ద్రుపదునికి. క్షణంపాటు మవునం వహించాడు. తర్వాత చెప్పాడిలా. ధర్మజా! ధర్మసూక్ష్మాన్ని అంత తేలిగ్గా పరిష్కరించలేం. అన్ని కాలాలూ,...

0

మహాభారతం (59 భాగం)

ద్రౌపది వరించిన బ్రాహ్మణుడెవరు? అతని వంశం ఏమిటి? తల్లిదండ్రులెవరు? గురువు ఎవరు? వివరాలన్నీ ధృష్టద్యుమ్నుణ్ణి తెలుసుకుని రమ్మన్నాడు ద్రుపదుడు. తెలుసుకుని వచ్చాడతను. చెబుతున్నాడిలా. అసలు విషయం ఏమిటంటే తండ్రీ! అన్నదమ్ములు అయిదుగురూ అలా పడుకున్నారని చెప్పానుగదా, అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఏం మాట్లాడుకున్నారు? అడిగాడు...

0

మహాభారతం (58 భాగం)

ఓటమిని అంగీకరించలేదు కర్ణుడు. బ్రాహ్మణునితో యుద్ధం చేయడం ప్రమాదం కొనితెచ్చుకోవడం అన్నాడు. ఆ సాకుతో వెను తిరిగిపోయాడు. అర్జునునితో తలపడలేకపోయాడతను. అలాగే మల్లయుద్ధంలో భీముణ్ణి ఎదిరించలేక శల్యుడు స్వయంవరమండపం నుంచి పారిపోయాడు. ఎప్పుడైతే అటు కర్ణుడూ, ఇటు శల్యుడూ వెన్ను చూపారో అప్పుడు బ్రాహ్మణులంతా భీమార్జునులను చుట్టిముట్టారు....

0

మహాభారతం (57 భాగం)

రాజులంతా విల్లు దగ్గరకు పరుగుదీస్తున్నారు. పళ్ళు బిగకరచి వింటిని వంచే ప్రయత్నం చేస్తున్నారు. నారి బిగించేందుకు శక్తినంతా కూడదీస్తున్నారు. ఫలితం లేకపోతోంది. విల్లు వంగడం లేదు. నారిని బిగించడం శక్తికి మించిన పని అవుతోంది. అశక్తులై అంతా వెను తిరుగుతున్నారు. ఆ సమయంలో అన్న ధర్మరాజుకేసి నవ్వుతూ...

0

మహాభారతం(56భాగం)

గంగానదిని దాటారు పాండవులు. ఉత్కచతీర్థానికి చేరుకున్నారు. ధౌమ్యుణ్ణి చూశారు. తపస్సులో ఉన్నాడతను. నమస్కరించారతనికి. వారిని చూసి పొంగిపోయాడు ధౌమ్యుడు. ఉచితరీతిన సత్కరించాడందరినీ. విషయం విపులంగా తెలుసుకున్నాడు. పాండవుల ప్రార్థన మేరకు పౌరోహిత్యానికి అంగీకరించాడు. ఆనాటి నుంచి ధౌమ్యుడు పాండవులకు పురోహితుడు అయ్యాడు. ఉత్కచం నుండి నేరుగా పాంచాలానికి...

0

మహాభారతం(55భాగం)

అదృశ్యంతికి పరాశరుడు పుట్టాడు. మనవణ్ణి చూసి మురిసిపోయాడు వశిష్ఠుడు. పెరిగి పెద్దవాడయ్యాడు పరాశరుడు. తండ్రిని రాక్షసుడు తినేశాడని తల్లి చెప్పగా తెలుసుకున్నాడతను. దుఃఖంతోనూ, కోపంతోనూ రగలిపోయాడు. తపశ్శక్తితో లోకసంహారానికి పూనుకున్నాడు. మనవడు లోకసంహారానికి పూనుకున్నాడని తెలిసి, బాధపడ్డాడు వశిష్ఠుడు. – చంపినవాడు రాక్షసుడైతే, లోకం మీద కసి...

0

మహాభారతం(54భాగం)

క్షాత్రబలం కన్నా తపోబలం గొప్పది అనుకున్నాడు విశ్వామిత్రుడు. రాజ్యాన్నీ, సంపదల్నీ విడచిపెట్టి, తపోవనానికి చేరుకున్నాడు. ఘోరతపస్సు చేశాడు. దాని ఫలితంగా సర్వసిద్ధులూ, సకల సంపదలూ పొందాడు. బ్రహ్మర్షి అయ్యాడు. కేవలం వశిష్టునిపై కక్ష తీర్చుకునేందుకే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడంటే నమ్మశక్యం కాదెవరికీ. అయినా ఇది నిజం అన్నాడు...

0

మహాభారతం(53భాగం)

వేటకి అడవికి వచ్చిన సంవరుణుడు, అక్కడ కొండపక్కన నిల్చున్న ఓ అందమైన యువతిని చూశాడు. మోహించాడామెను. చేతులు జాచి అందుకుందామనుకుంటే అదృశ్యమైందామె. తట్టుకోలేకపోయాడది సంవరుణుడు. విలపించసాగాడు. అప్పుడు ఆమె మళ్ళీ ప్రత్యక్షమైంది. ప్రేమగా చూసిందతన్ని. నువ్వు లేని నేను లేను. నన్ను అనుగ్రహించు. ఇద్దరం గాంధర్వవివాహం చేసుకుందాం...